హైదరాబాద్ పాతబస్తీలో కొత్తగా మరో మస్తీ కల్చర్ బయటపడింది. ఓ ఫంక్షన్ హాల్లో విదేశీ యువతలతో బెల్లీ డ్యాన్స్ నిర్వహించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అశ్లీల నృత్యాలతో చిందులేశారు. ఇప్పుడు అదే, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తంతు కాస్తా ఖాకీల కంట పడింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎంట్రీ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న తంతంగం చూసి ఖాకీలే షాకయ్యారు.
బెల్లీ డ్యాన్స్‌తో లొల్లి చేసిన వారిని, నోట్లను వెదజల్లిన ప్రబుద్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, హైదరాబాద్ నగర పరిధిలోగల చంద్రాయణగుట్టలో సౌదీ, దుబాయ్ వంటి దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ బెల్లీ డ్యాన్స్ షోను నిర్వహించారు. ఎంజాయ్మెంట్ ముసుగులో యువత నుంచి దండిగా డబ్బులు దండుకున్నారు.
ఖాకీల ఎంట్రీతో నిర్వాహకుల కథ అడ్డం తిరిగింది. బెల్లీ డ్యాన్స్‌కు అనుమతి లేదన్న పోలీసులు సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఓ పెళ్లి సందర్భంగా బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు చేసినట్టు తేలింది. సదరు పెళ్లి కొడుకు, అతని తండ్రి, ఫంక్షన్ హాల్ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను రాబడుతున్నారు.