Home / SLIDER / సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌లో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఒక‌టే ప్ర‌చారం హైదరాబాద్ నుండి కంపెనీలు తరలిపోతాయని, ఇక కొత్త పెట్టుబడులు రావనేది వాటి సారాంశం. అలా సాగిన ఆ ప్రచారపు హోరును ఒంటిచేత్తో కేటీఆర్‌ ఎదుర్కున్నారు. ఓ పక్క పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పక్కా ప్రణాళికతో బ్రాండ్ హైదరాబాద్‌ను సమున్నతంగా నిలబెట్టారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి నెలలోనే ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు మంత్రి కేటీఆర్. సక్రమమైన వ్యాపారం చేసుకునే సంస్థలకు కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని స్పష్టం చేశారు. తొలి మూడు నాలుగు నెలలూ ఇక్కడున్న ఐటీ కంపెనీలకు భరోసా కల్పించడంలో శ్రద్ధ పెట్టడంతో అంతకుముందు గిట్టనివారు చేసిన ప్రచారం దూదిపింజల్లా తేలిపోయింది.

ఫ‌లిత‌మే ఐటీ రంగంలో తెలంగాణ ప్రముఖ స్థానంలో ఉంది. విఖ్యాత మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. ఆపిల్‌, అమెజాన్‌లు ఇక్కడి నుంచి కార్యకలాపాలను ప్రారంభించాయి. దేశీయ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌మహింద్ర వంటివి భాగ్యనగరానికి ఖ్యాతిని తెస్తున్నాయి. ఐటీ రంగం వ్యవస్థీకృత అభ్యున్నతితోపాటు అంకుర పరిశ్రమల ద్వారా మానవ వనరుల వృద్ధి, ఉపాధి కల్పన, సేవల విస్తృతికి విశేష కృషి చేస్తోంది. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ అంతర్జాల (ఇంటర్నెట్‌) సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

దీనికి మంత్రి కేటీఆర్ విజ‌న్ ప్ర‌ధాన కార‌ణం. స్వ‌రాష్ట్రంలో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న ఐటీ రంగాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులకు అనుకూలమైన అంశాలతో కూడిన కొత్త ఐటీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ నాలుగున తెచ్చింది. ఇందులో రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలను కల్పించింది. తెలంగాణవ్యాప్తంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధన లక్ష్యాలను ఇందులో పేర్కొంది. నూతన ఆవిష్కరణలు, గేమింగ్‌ యానిమేషన్‌, ఎలక్ట్రానిక్‌ తయారీ, గ్రామీణ సాంకేతిక విధానాలు ఇందులో ఉన్నాయి. అయిదు లక్షల మందికి ఉద్యోగాలు, రూ.1.36 కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యాన్ని దీనిలో నిర్దేశించారు. ఇక ఆవిష్క‌ర‌ణ‌ల‌ది కీల‌క పాత్ర. టీహబ్‌ ఆరంభంనాడు హైదరాబాద్‌లో అంకుర పరిశ్రమల సంఖ్య వంద లోపే. ఏడాది వ్యవధిలోనే వాటి సంఖ్య రెండు వందలకు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా 17 అంకుర కేంద్రాలకు హైదరాబాద్‌ స్థానమైంది. టీహబ్‌ రెండోదశ తరవాత అంకుర కేంద్రాల సంఖ్య రెండువేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని మొదటి పది అంకుర నగరాల్లో హైదరాబాద్‌ ఉండాలనే లక్ష్యంతో, అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో టీహబ్‌ అవుట్‌పోస్టును టీబ్రిడ్జి పేరిట ప్రభుత్వం స్థాపించింది. అలా సైబ‌ర‌బాద్‌కు సిలికాన్ వ్యాలీకి క‌నెక్ట్ చేయ‌గ‌లిగారు కేటీఆర్‌. భారత్‌, సిలికాన్‌ వ్యాలీల మధ్య ఆలోచనల మార్పిడికి, అంకురాల బదలాయింపులకు ఇది వారధిగా నిలిచింది.

ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు ఐటీ విస్త‌ర‌ణ‌లో భాగంగా క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్ వంటి ప్రాంతాల్లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ను విస్త‌రించారు. ప్ర‌ముఖ కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను ఇక్క‌డ ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. త‌ద్వారా ఐటీ అంటే హైద‌రాబాద్‌లోని ఒక ప్రాంతం మాత్ర‌మే కాద‌ని ఆయ‌న రుజువు చేశారు. ఇక మ‌రో కీల‌క అంశం స్వ‌రాష్ట్ర ఫ‌లాల‌ను మ‌న బిడ్డ‌ల‌కు అందించ‌డం. రాష్ట్రంలోని ఐటీ రంగంలో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ (టాస్క్‌)ని ఏర్పాటు చేసింది. దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణేే! కళాశాలల నుంచి బయటకు వచ్చిన పట్టభద్రులకు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతిక శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు. దీనిలో శిక్షణ పొందినవారిలో 90 శాతానికి ఉపాధి లభిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రోమెకానికల్‌, మెకానికల్‌ వంటి హార్డ్‌వేర్‌ రంగంలోనూ అంకురాల అభివృద్ధి కోసం టీవర్క్స్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రగతికి డిజిటల్‌ తెలంగాణ పథకం ఎంతగానో వూతమిచ్చింది. ప్రతి గ్రామీణుడికి డిజిటల్‌ సౌకర్యాలు అందించడం; ప్రభుత్వ పాలన, సేవలను నవీకరించాలనే లక్ష్యంతో 2015 జులై ఒకటిన దీన్ని ప్రారంభించారు. పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లతో పాటు సామాన్యులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చేందుకు ఇది ఉపయోగపడింది. రాష్ట్రంలో 4జీ సేవల విస్తరణ, హైదరాబాద్‌లో వైఫై సేవలు, ఇ-పంచాయతీల స్థాపన వంటి చర్యలు చేపట్టారు. వ్యవసాయ సేవలు, యాదాద్రి, భద్రాద్రి దేవాలయాల్లో డిజిటల్‌ సేవలు మొదలెట్టారు. సైబర్‌ భద్రత ఏర్పాట్లూ చేశారు. బయోమెట్రిక్‌ సేవలను విద్యాసంస్థలు, వసతిగృహాలతో పాటు పింఛన్లు, నిత్యావసర వస్తువుల పంపిణీకి విస్తరించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీల విషయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్ కార్యాచ‌ర‌ణ వల్ల ఇది సాధ్యమైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat