అనుపమ పరమేశ్వరన్ టాలెంట్‌ను టాలీవుడ్ సరిగా వాడుకోవట్లేదా..? ఆమెకు ఇంకా సరైన అవకాశాలు రావట్లేదా..? ఈ విషయంలో ఆ ముద్దుగుమ్మ కూడా బాగా ఫీలవుతుందా..? అయితే, అనుపమ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకు తనలోని ఒకపక్క కోణాన్ని మాత్రమే టాలీవుడ్ వాడుకుందని చెబుతోంది అనుపమ. ఇంతకీ అనుపమ ఏ విషయంలో ఇంతగా ఫీలవుతుందో తెలుసా..?
ఉన్నదీ ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, ఈ మధ్యనే వచ్చిన తేజ్ ఐ లవ్యూ ఇలా వరుస ప్లాప్‌లతో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అనుపమ మాత్రం గ్లామర్ షో జోలికి మాత్రం పోలేదు. కానీ, తాను గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడనంటోంది ముద్దు గుమ్మ. ఇలా అనుపమ గ్లామర్ షోపై ఓపెన్ అవడంతో.. ఈ భామకు ఆఫర్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి మరీ.