మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో వీలినం చేసి రాజ్యసభ పదవీని తీసుకున్న సంగతి తెల్సిందే.
అంతే కాకుండా యూపీఏ ప్రభుత్వ హాయంలో సహాయ కేంద్రమంత్రిగా పని చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడిచారు. నిన్న ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో అరవై నుండి డెబ్బై స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాను.ఇదే విషయం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాను.
దీనికి చంద్రబాబు నాయుడు అలా వద్దు..బరిలోకి దిగితే ఓట్లు చీలతాయి.నీకు రాజ్యసభ ఎంపీ ఇస్తాను హామీ ఇచ్చారు..అయితే నాలుగేళ్ళైన కానీ ఇంతవరకు రాజ్యసభ ఎంపీ పదవీ ఇవ్వలేదు. అక్కడితో ఆగకుండా తన అస్థాన మీడియాలో నాగురించి విషప్రచారం చేశారు.అప్పుడే బాబుపై నమ్మకం కోల్పోయాను.అందుకే బయటకు వచ్చాను అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ రాజ్యసభ ఎంపీ పదవీ కోసమే పార్టీ పెట్టినట్లు..టీడీపీతో కల్సి నట్లు చెప్పకనే చెప్పాడు అన్నమాట..