Home / MOVIES / పడి ప‌డి లేచే మ‌న‌సు బ‌డ్జెట్ బెదుర్స్‌..!

పడి ప‌డి లేచే మ‌న‌సు బ‌డ్జెట్ బెదుర్స్‌..!

శ‌ర్వానంద్‌కు అన్ని కోట్ల మార్కెట్ ఉందా..? లేద‌ని తెలిసినా రిస్క్ చేస్తున్నారా..? అంత రాద‌ని లెక్క‌లు చెబుతున్నా కూడా.. క‌థ‌పై న‌మ్మ‌కంతో పెట్టేచేస్తున్నారా..? ఇప్పుడు ఈ అనుమానాల‌న్నీ శ‌ర్వానంద్ కొత్త సినిమాకే వ‌స్తున్నాయి. ప‌డి ప‌డి లేచే మ‌నసు బ‌డ్జెట్‌చూస్తుంటే ఇప్పుడు షాక్ త‌ప్ప‌ట్లేదు. మ‌రీ ఏ న‌మ్మకంతో శ‌ర్వానంద్‌పై ఇంత బ‌డ్జెట్ పెట్టేస్తున్నారు.

చిన్న సినిమాతో మొద‌లై.. ఒక్కో సినిమాతో త‌న మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు శ‌ర్వానంద్‌. శ‌ర్వానంద్ మార్కెట్ ఐదు కోట్ల నుంచి మొద‌లై.. రూ.30 కోట్ల వ‌ర‌కు పెరిగింది. గ‌త ఏడాది శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో దాదాపు 33 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేశాడు. మ‌హానుభావుడు చిత్రం కూడా రూ.22 కోట్ల‌కు పైగానే వసూలు చేసింది. హిట్ అయితే రూ.20 కోట్ల మార్క్‌ను అందుకోవ‌డం ఇప్పుడు శ‌ర్వానంద్‌కు అల‌వాటుగా మారిపోయింది.

మ‌హానుభావుడు చిత్రం త‌రువాత బాగానే గ్యాప్ తీసుకున్న శ‌ర్వా ప్ర‌స్తుతం హ‌నురాఘ‌వ‌పూడితో ప‌డి ప‌డి లేచె మ‌న‌సుతోపాటు సుధీర్ వ‌ర్మ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటిలో హ‌ను సినిమా ముందే విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్య‌నే కోల్‌క‌తాలో 70 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు నేపాల్ వెళ్ల‌నుంది. అక్క‌డ క్లైమాక్స్‌ను పూర్తి చేయ‌నున్నాడు ద‌ర్శ‌కుడు హ‌ను. సాయి ప‌ల్ల‌వి ఇందులో హీరోయిన్‌.

అయితే, క్లైమాక్స్‌లో భూకంపం వ‌చ్చే సీన్స్ ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీని కోసం గ్రాఫిక్స్‌ను వాడుకునేప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ సీన్స్ చిత్రీక‌ర‌ణ కోస‌మే బ‌డ్జెట్ శ‌ర్వానంద్ మార్కెట్‌ను మించి పోతున్నా ద‌ర్శ‌కుడి దారిలో నిర్మాత వెళుతున్నాడ‌ట‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat