Home / SLIDER / మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం..!!

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కు మరో అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న Global Climate Action Summitసదస్సులో ప్రసంగించాల్సినదిగా పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రి కేటీ రామారావు కి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరుగుతుంది.

ఈ సదస్సులో పాల్గొని ” ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్” అనే అంశంపైన ప్రసంగించాలని మంత్రి కేటీ రామారావు ని ఈ లేఖలో గవర్నర్ కోరారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు భవిష్యత్తు చేపట్టబోయే కార్యక్రమాలను వాతావరణ అనుకూల కార్యక్రమాల పై కూడా వివరించాల్సిందిగా కోరారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు పైన చైతన్యవంతం చేసే దిశగా ఈ సదస్సు ఉంటుందని తెలిపిన.., ఈ సదస్సు ద్వారా వివిధ ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్ ను సానుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచం లోని వివిధ ప్రభుత్వాల నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న కీలకమైన వ్యక్తులు హాజరవుతారని మంత్రికి పంపిన ఆహ్వానంలో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat