Home / SLIDER / పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు మంత్రి కేటీఆర్ సూచ‌న‌

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు మంత్రి కేటీఆర్ సూచ‌న‌

తన జన్మదినం సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చేసే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతోపాటుగా అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను  తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిన ఉదంతాన్ని ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ‘సర్‌ మీరు మా మాలాంటి వారికి స్ఫూర్తి కావాలి. మీ పుట్టినరోజు జరుపుకోవాలనే శ్రేయోభిలాషులు ఇలా ఖర్చు చేసే మొత్తాన్ని మంచి అవసరాల కోసం ఖర్చు చేయాలని మీరు సూచించవచ్చు కదా?’ అని సూచించారు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘మీతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా హోర్డింగ్‌లు, పత్రికా ప్రకటనల రూపంలో ఖర్చులు చేసే బదులుగా అదే మొత్తాన్ని  ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు ఇవ్వండి. నగరంలో ఒకవేళ ఎక్కడైనా హోర్డింగ్‌లు ఉంటే గనక వాటిని వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను కోరుతున్నాను’అని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat