రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా కుటుంబాన్ని కోలుకోలేనివిధంగా శోక సంద్రంలో ముంచాయని తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన భూమా కుటుంబం టీడీపీలోకి ఫిరాయించిందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా భూమా కుటుంబీకులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ గంగుల ఆద్వర్యంలో భూమా చెంచి రెడ్డితో పాటు వందల కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈయన చేరికతో కర్నూల్ జిల్లాలో వైసీపీ మరింత బలపడిందని గుంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంతేకాదు వీరితో పాటు చాల గ్రామాలు, నాయకులు, లీడర్లు కూడ వైసీపీలో చేరతారని అన్నారు. ప్రస్తుతం గంగుల వాఖ్యలతో టీడీపీ అలజడి మొదల్యైందని వైసీపీ నేతలు అంటున్నారు.
