Home / Uncategorized / అధికారుల‌కు సీఎస్ ఎస్.కె.జోషి కీలక ఆదేశం

అధికారుల‌కు సీఎస్ ఎస్.కె.జోషి కీలక ఆదేశం

రాష్ట్రంలో ఉన్న 54 లక్షల ఎస్‌సీ జనాబాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీ జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సీజీజీ ద్వారా రూపొందించాలని సీఎస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు. అంబేద్కర్ విద్యా నిధి పథకానికి సంబంధించి 81 కోట్ల రూపాయలతో 465 మంది విద్యార్ధులకు మంజూరు చేశామని, విదేశాలకు వెళ్ళిన ప్రతి విద్యార్ధిని నిరంతరం సంప్రదించాలని అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొంది స్ధిర పడిన విద్యార్ధుల మెసేజ్ లు, ఆడియో, వీడియో రూపంలో ప్రదర్శించి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకోవాలన్నారు.

గురువారం సచివాలయంలో ఎస్‌సీ అభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బుద్దప్రకాశ్ జ్యోతి, యస్.సి సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శి ఆర్.యస్. ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ కరుణాకర్, యస్.సి కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యం.డి లచ్చిరాం బుక్యా తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు 504 కోట్ల రూపాయలతో 88,786 మందికు ప్రయోజనం చేకూర్చామని ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను 45 రోజులలోగా విచారణ పూర్తి చేయని అధికారుల వివరాలను జిల్లాల వారిగా రూపొందించి కలెక్టర్లకు తెలపాలని ఆయన సూచించారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద 400 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 2014-15 నుండి 2017-18 వరకు 8,74,443 మందికి పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్స్, 2.50 లక్షల మందికి ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నామన్నారు. ఈ విషయమై నెల వారిగా అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 675 ప్రిమెట్రిక్, 179 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు పనిచేస్తున్నాయని, ఇందులో 77,612 మంది విద్యార్ధులు విద్యానభ్యసిస్తున్నారని, వీరికి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

ఎస్‌సీ స్టడీ సర్కిల్ కు 16 కోట్ల రూపాయలను కేటాయించి విద్యార్ధులకు యుపి యస్.సి, స్టేట్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సురెన్స్ లాంటి వాటికి శిక్షణ నిస్తున్నామని స్టడీసెంటర్లలో వసతులు మెరుగు పరచటానికి దృష్టి సారించాలన్నారు. యస్.సి ఎస్ డిఎఫ్ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

యస్సీ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా ఆర్ధిక చేయూత పొందిన లబ్ది దారుల స్ధితి గతులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత 4 సంవత్సరాలలో ఎకనామిక్స్ సపోర్టు స్కీం కింద 1,04,980 మందికి 1136 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ మంది యస్.సి నిరుద్యోగ యువత శిక్షణ పొందేలా చూడాలన్నారు.

యస్.సి గురుకుల విద్యాలయాల్లో 57,500 ఖాళీలకు గాను 2,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు సి.యస్ కు తెలిపారు. 268 గురుకుల విద్యాసంస్ధల్లో 1,28,328 మంది విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ రిక్రూట్ మెంట్ బోర్డు(TREI) ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను వేగవంతం చేయాలన్నారు.  రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్ధుల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలు, ఉత్తీర్ణత వివరాలు, వివిధ విద్యా సంస్ధలో పొందిన సీట్ల వివరాలను అధికారులు సి.యస్ కు వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat