ఆయన టీన్యూస్ ఛానెల్ ఎండీ ..అంతకంటే దాదాపు రెండు దశాబ్దాలు పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంట నడిచిన యువకుడు .నాడు ఉద్యమం సమయంలో చిన్నవయస్సులోనే ఒక ఛానల్ ఎండీగా వలస పాలకుల కుట్రలను తట్టుకుంటూ ఆ కుట్రలను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రచారం చేసేలా ..ఎక్కడ చిన్న ఉద్యమం జరిగిన క్షణాల్లో లైవ్ లో ప్రసారమై విధంగా చేసి తెలంగాణ ఉద్యమ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పిన ఉద్యమ నాయకుడు .
ఆయనే జోగినపల్లి సంతోష్ కుమార్ .ఇటీవల పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సంగతి తెల్సిందే .నిన్న మంగళవారం టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్వీ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించగా పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు .
ఈ సమావేశానికి సంతోష్ కుమార్ కూడా హాజరయ్యారు .ఈ సమావేశంలో అందరి కంటే సంతోష్ మెయిన్ అట్రాక్షన్ గా మారిపోయారు .దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు ఉద్యమంలో తమతో పాటు కల్సి ఉద్యమం చేసిన ఉద్యమ వీరుడు ..గత మూడున్నర ఏండ్లుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్న సంతోష్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో ఇటు ఆ పార్టీ నేతలు ,ఉద్యమకారులు గర్వంతో సంతోష్ ను అందరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ అభినందనలు చెప్పారు .ఈ క్రమంలో ఇటు ఉద్యమ కారుల అటు పార్టీ శ్రేణుల్లో ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో వ్యక్తం చేశారు .