తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం నేతృత్వంలో నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది .ఈ సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు .
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “భవిష్యత్తులో పార్టీ పరంగా విద్యార్ధి విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం .ఇక నుండి ప్రతి రెండు యేండ్లకు ఒకసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యార్ధి విభాగానికి ఒక ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తాం .అసలు నియోజక వర్గ పెంపు జరిగి ఉంటె విద్యార్ధి విభాగానికి నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించే వాళ్ళం .నాడు విద్యార్ధిగా ఉండి ఉద్యమం చేసిన ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ కు ఎంపీ అవకాశం వచ్చింది .
భవిష్యత్తులో రాజకీయాలను శాసించేది విద్యార్ధులే అని .దానికి తగ్గట్లు పని చేయాలని సూచించారు .గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఎస్వీ సభ్యత్వాలు నమోదు కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ,టీఆర్ఎస్వీ సమన్వయ కర్త ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పార్టీకి చెందిన ఇతర నాయకులు హాజరయ్యారు .