ఏపీలో తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి ముప్పై మంది గల్లంతైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మాత్రమే గల్లంతయ్యారు అని సర్కారు చెబుతుంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి అచూకీ కోసం చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి పిల్లలకు మూడు లక్షలు,పెద్దలకు ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించారు..గల్లంతైన వారిలో ఆరుగురు విద్యార్థులు,ఒకరు మహిళ,ఇద్దరు మగవారు ఉన్నట్లు సమాచారం..