గతంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే..
తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు..
తనది రైతు పార్టీ అని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పడుతున్న బాధలను కష్టాలను దగ్గర ఉండి మరి చూశాను అని ఆయన చెప్పారు.అయితే తాను ఏ పార్టీలో చేరను అని ..తనే ఒక పార్టీ పెట్టనున్నట్లు హింట్స్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ పేరు రైతు పార్టీ అని చెప్పకనే చెప్పారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు.