వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై, అలాగే, చంద్రబాబు సర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు హారతులు పడుతున్నారు. అంతేకాకుండా, వారి సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ టీడీపీ నేతలు మహిళలపై చేస్తున్నదాడుల గురించి జగన్‌కు చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను గురువారం కుంకుమపువ్వు సీరియల్ ఆర్టిస్ట్ కృష్ణ కిశోర్ కలిశారు. తూర్పు నియోజకవర్గం జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని ఊలపల్లి గ్రామంలో వైఎస్ జగన్ వెంట నడిచారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని కృష్ణ కిశోర్ అన్నారు.