రంగస్థలం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) రంగస్థలం గ్రామ సర్పంచ్‌గా 30 ఏళ్లుగా కొనసాగుతుంటాడు. సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారీ.. తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని.. అలాగే, రంగస్థలం గ్రామంలో తనకు ఎదురు తిరిగిన వారిపై ఫణీంద్ర భూపతి తన మనుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివరకు సర్పంచ్‌గా ఏకగ్రీవమవుతుంటాడు. అయితే, ఒకానొక సమయంలో తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిపై ఫణీంద్రభూపతి తన మనుషులతో దాడులు చేయించారన్న విషయం రంగస్థలం గ్రామంలోని ప్రజలందరికీ తెలిసిపోతుంది. దీంతో ఫణీంద్ర భూపతిపై ప్రజల్లో ఊహించని విధంగా ఆగ్రహం పెరిగిపోతుంది.. ప్రజల్లో చులకన భ. ఆ తరువాత ఏం జరిగిందన్నదీ అందరికి తెలిసిన విషయమే..!
అయితే, పై విధంగా రంగస్థలం చిత్రానికి.. ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఓ ఫోటోను పోల్చుతూ ఓ సోషల్ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మీ వెధవల బాగోతం అంత నాకు తెలుసు..! మీరు నన్నేమీ చేయలేరు..! అనే రీతిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎదుట ఓ ప్రభుత్వ అధికారి కాలు మీద కాలేసుకుని కూర్చుకున్నాడు. అలా సీఎం చంద్రబాబు ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న వ్యక్తి మరెవరో కాదు.. సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాల్యూ అంటూ ఆ కథనం పేర్కొంది.
ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగింది….? ఎప్పుడు జరిగింది..? అన్న విషయాలను కూడా ఆ సోషల్ మీడియా కథనం వివరాలతో సహా పేర్కొంది. ఇటీవల సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక కోసం జరిగిన సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఒక కుర్చీలో..సీఎం ముఖ్య కార్యదర్శి మరో కుర్చీలో కూర్చొని ఉండగా.. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో తన ఎదురుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉన్నాడని తెలిసి కూడా.. సీఎం కార్యదర్శి కాలుమీద కాలేసుకుని కూర్చుకున్నఫోటోను సోషల్ మీడియా పోస్టు చేసింది.
చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతి, ప్రభుత్వ కార్యక్రమాల్లో, నీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో టీడీపీ నేతలు పాల్పడిన కుంభకోణాల లెక్కల లిస్టు తన వద్ద ఉన్నందునే సీఎం ముఖ్య కార్యదర్శి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట కాలుమీద కాలేసుకుని చేసేలా ధైర్యం తెచ్చిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.