ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు టాలీవుడ్ సినిమా ప్రముఖుల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇటీవలనే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ రాజ్ లు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కలిశారు. ఈరోజు (సోమవారం) తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటూ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ..కొది దూరం నడిచారు. అంతేకాదు మీ పాదయాత్రతో టాలీవుడ్ లో చాలమంది..అప్పుడు మీ తండ్రిలాగే మా సినిమా రంగానికి న్యాయం చేయగలరని…అందుకే వైసీపీలోకి జాయిన్ అవుదామని అనుకుంటున్నారని జగన్ తో చెప్పినట్లు సమచారం. త్వరలో మొత్తం లీస్ట్ బయటకు వస్తుంది..అప్పుడు మీకు తెలుస్తుంది అన్నారంట. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే మీరు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 209వ రోజు ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఉదయం సోమేశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభంకాగా.. సీతమ్మ తోట, లొల్ల మీదుగా సాయంత్రానికి రాయవరంకు చేరుకుంటుంది. జగన్‌కు అడుగడునా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.