Home / ANDHRAPRADESH / ఓ త‌ల్లి ఏం చెప్పిందో వివ‌రించిన అనీల్ కుమార్ యాద‌వ్‌..!

ఓ త‌ల్లి ఏం చెప్పిందో వివ‌రించిన అనీల్ కుమార్ యాద‌వ్‌..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ఆయ‌న్ను ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ ఇంకా ధన్య‌మైంది ఎందుకంటే..? మ‌గాడి లాంటి బిడ్డ‌ను క‌న్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు కావ‌డ‌మే కాకుండా.. ఆ గుండె చ‌ప్పుడును త‌ర‌త‌రాలు.. త‌ర త‌రాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి క‌న్నాడు. అత‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అని నెల్లూరు న‌గ‌ర‌ ఎమ్మెల్యే అనీల్ కుమార్ అన్నారు.

కాగా, అమెరికాలోని ఫిల‌డెల్ఫియా ప‌రిధిలోగ‌ల నాటా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగిన వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అనీల్ కుమార్ పాల్గొని ప్ర‌సంగించారు. అయితే, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా ఎందుకు ఉన్నాడో.. ఓ ముగ్గురు ఆడ పిల్ల‌ల చిన్నారుల‌ త‌ల్లి వైఎస్ఆర్ గురించి ఏమని చెప్పిందో వివ‌రించాడు. నాడు వైఎస్ జ‌గ‌న్ రావుల‌పాళెం నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు చేసిన పాద‌యాత్రలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చెప్పాడు.

వైఎస్ జ‌గ‌న్ రావుల‌పాళెం నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు మూడు రోజుల‌పాటు జ‌రిగిన పాద‌యాత్ర‌లో.. రెండో రోజు ఓ ముగ్గురు ఆడ పిల్ల‌ల త‌ల్లి వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి.. మాట్లాడాల‌నే ఉద్దేశంతో మండుటెండ‌ను సైతం లెక్క చేయ‌కుండా రోడ్డుపైనే నిల‌బ‌డి ఉండింద‌ని, జ‌గ‌న్‌ను క‌లిసి త‌న ఆవేద‌న‌ను చెప్పుకోవాల‌న్న ఒక్క కార‌ణంతో జ‌గ‌న్ వెళ్లే రోడ్డుపై గంట‌ల‌త‌ర‌బ‌డి నిల‌బ‌డే ఉండింద‌ని గుర్తు చేశాడు.

అయితే, ఆ మ‌హిళ అనుకున్న‌ట్టుగానే పోల‌వ‌రం వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌ను క‌లిసి చెప్పిన మాట‌ల‌ను అనీల్ కుమార్ వివ‌రించారు. ఆ సంఘ‌ట‌న ఆ మ‌హిళ‌మాట‌ల్లోనే.. అన్నా. నాకు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు స‌రిగ్గా వినిపించ‌దు, మాట‌లు కూడా స‌రిగ్గా రావు. వారిముగ్గురికి ఆప‌రేష‌న్ చేయాలంటే ఒక్కొక్క‌రికి ఆరు ల‌క్ష‌లు చొప్పున రూ.18 ల‌క్ష‌లు చెల్లించాల‌ని వైద్యులు అడిగారు. అంత డ‌బ్బు చెల్లించే స్తోమ‌త త‌మ‌కు లేద‌ని, అటువంటి స‌మ‌యంలో దేవుడిలా 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయి, త‌న ముగ్గురు కుమార్తెల‌ను కాపాడాడు. వైఎస్ఆర్ మా పాలిట దేవుడై ఆదుకున్నాడు. అంటూ ఆ మ‌హిళ జ‌గ‌న్‌కు చెప్పుకొచ్చింది.

ఆ మ‌హిళ చెప్పిన మ‌రో మాట అక్క‌డ ఉన్న‌వారంద‌ర్నీ కంట త‌డి పెట్టించింది. అదేమిటంటే..? అన్నా ఒక్క సంవ‌త్స‌రం ముందు (అంటే 2003)లో క‌నుక వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయి ఉంటే నా భ‌ర్త బ‌తికి ఉండేవాడ‌న్నా.. ముగ్గురు ఆడ పిల్ల‌లు అవ‌ల‌క్ష‌ణాల‌తో పుట్ట‌డంతో చూసి భ‌రించ‌లేక‌.. బాధ‌తోకుంగి మ‌ర‌ణించాడ‌న్నా.. .2003లో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయి ఉంటే నా భ‌ర్త బ‌తికి ఉండేవాడ‌న్నా అంటూ త‌న ఆ వేద‌న‌ను మ‌హిళ వ్య‌క్తం చేసింద‌ని అనీల్ కుమార్ యాద‌వ్ గుర్తు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat