విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఏపీ లో సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని పవన్ చెప్పారు. 2014లో తాను తన అన్న చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే తెలుగు తమ్ముళ్లు దోచేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రదాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటే అంటే భయమని చెబుతూ పవన్ మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. అంతేకాదు స్వయంగా చంద్రబాబు ఆ విషయం తనతోనే చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే తానేమైపోతానోనని భయంగా ఉందని, 2014 ఎన్నికల తర్వాత ఇంటికి భోజనానికి పిలిచి ఒకవేళ తాను ఓడిపోతే అండగా ఉండాలని తనను స్వయంగా చంద్రబాబు కోరారని పవన్ చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు జడ్ కేటగిరీ భద్రత తొలగించారని, ఎవరైనా చంపేస్తారనే భయంతో ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్ సిఫార్సుతో తిరిగి భద్రత తెచ్చుకున్నారని,ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తండ్రిలాగే చేస్తాడనే భయం బాబుకు ఉందని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు టీడీపీ నేతల్లో బయం మొదలైయ్యిందని సమచారం.