కత్తి మహేష్. గత కొంతకాలంగా నిత్యం వార్తలో ఉంటున్న టాలీవుడ్ సినీ క్రిటిక్. బిగ్‌బాస్ రియాల్టీషో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్.. ఆ తరువాత పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌పై వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పవన్ ఫ్యాన్స్‌తో నెలరోజులపాటు సోషల్ మీడియా వార్ కొనసాగించిన ఈ రివ్యూ రైటర్ ఇప్పుడు శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. కత్తి మహేష్ పై హిందూత్వ సంఘాలే కాదు.. రాజకీయ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు.
మొన్నటికి మొన్న మెగా బ్రదర్ నాగబాబు కత్తి మహేష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదంటూ సీరియస్ అయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్, ఇటీవల బీజేపీ కండువాకప్పుకున్ని మాధవీలత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీతమ్మ తల్లి రావణుడి వద్దే ఉండాలని చెప్పడానికి వీడెవరు అంటూ మండిపడింది.
అసలు సీతారాముల వారి గురించి మాట్లాడే అర్హత కత్తిమహేష్‌పై విరుచుకుపడ్డింది. కత్తి మహేష్ చేసిన దారుణాలను భరించలేకే.. అతని భార్య వదిలేసి వెళ్లిపోయిందని మాధవీల తెలిపింది. భార్య వదిలేసి వెళ్లినా.. కత్తి మహేష్ చీకూ చింత లేకుండా ఎంజాయ్ చేస్తున్నాడని వివరించింది మాధవీ లత.