ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి.. ప్రస్తుతం మండపేట నియోజకవర్గం పసలపూడి మండలంలో కొనసాగిస్తున్నారు. ఇలా నిత్యం ప్రజల సమస్యలై పోరాటంలో భాగంగా జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉండగా, ఇవాళ (జూన్ 8న) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని జగన్ నివాళులు అర్పించారు. అయితే, వైఎస్ఆర్ జయంతి రోజునే జగన్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల మార్క్‌ను దాటడం గమనార్హం.