ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తాజాగా మానుగుంట చేరిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని మహీధర్‌రెడ్డి స్వయంగా తెలిపారు . ప్రస్తుతం మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు మానుగుంట మహీధర్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతోపాటు ఆయన అనుచరవర్గం పెద్ద ఎత్తున వైసీలో చేరుతునట్లు స్పష్టం చేశారు..కాగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి
మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి గురించి మీకు తెలియని విషయాలు
1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెంచు రామనాయుడుపై మహీధర్‌రెడ్డి గెలుపొందాడు.
1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండయ్య చౌదరిపై ఓటమి చెందారు.
1983 లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకటసుబ్బయ్యపై గెలుపొందారు.
1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మరోమారు గుత్తా పై గెలిచారు.
1989 మహీధరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యపై విజయం సాధించారు.
1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓటమి చెందారు.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాంను రెండు మార్లు వరుసగా ఓడించి సత్తా చాటారు .కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లో మున్సిపల్ శాఖామంత్రిగా పనిచేశారు.
2014 ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌రెడ్డి పోటీ చేయలేదు.