ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్‌ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. అశేష ప్రజాభిమానం నడుమ కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లోని తెలుగు వారు ఇది వరకు పలు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, అలాగే, వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇందుకు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదిక అయింది. అయితే, లాస్ ఏంజెల్స్‌లోని తెలుగువారు తాజాగా వైసీపీకి మద్దతుగా మరో సారి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జెండాలు కట్టిన సుమారు 50 వ్యాన్‌లతో, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ లాస్ ఏంజెల్స్ రోడ్లపై ర్యాలీ చేశారు.