ఏపీలో వైసీ పీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ వందకు పైగా సీట్లు గెలుచుకుని, ఇతర పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ జగన్ వైసీపీని నడిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలా వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని అంచనా వేసిన పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
see also:ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలోని తన సమీప బంధువుల ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధార్థ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయని సమాచారం .ఈ క్రమంలోనే అయన ఈ నెల 6వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కపుకోనున్నారని ఆయన సన్ని హితుల సమాచారం. అయితే సిద్ధార్థ రెడ్డిపై గతంలో నమోదైన కేసుల కారణంగా ఆయన ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలోనే కొంతకాలం నడిచారు.అయితే తాజాగా తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సిద్దార్థరెడ్డి ముఖ్య అనుచరుడు ఒకరు తెలిపారు.