Home / SLIDER / భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి

భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి

భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంటలను ఆర్పేందుకు జిల్లాలోని అగ్నిమాపక మోటార్లన్నింటిని ఉపయోగించాలని సూచించారు. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని అక్కడ పరిస్థితులను సమీక్షించారు. భద్రకాళి ఫైర్ వర్క్స్ లో సంఘటన జరిగిన షెడ్డులోకి వెళ్లి ప్రతి చోటుని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పర్యవేక్షించారు.

see also:మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్

అగ్నిప్రమాదం వల్ల బాంబుల పేలుడుతో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల కప్పులు, రేకులు కూడా ధ్వంసమయ్యాయి. ఫైర్ వర్క్స్ కంపెనీలో పనిచేసే దగ్గరున్న కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అనంతరం సంఘటన స్థలం నుంచి మృతదేహాలను తీసుకెళ్లిన ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సురేష్ ను పరామర్శించారు. వెంటనే సురేష్ ను నిమ్స్ కు తరలించాలని, మంచి వైద్యం అందించాలని కలెక్టర్ హరిత, ఎంజిఎం అధికారులు, డిఎంహెచ్ఓ కు సూచించారు. మైనర్ గాయాలైన వ్యక్తిని కూడా పరామర్శించారు. అక్కడి నుంచి మార్చురీకి వెళ్లి మంటల్లో కాలి ముద్ద అయిన మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంజిఎం ఆస్పత్రి వద్ద విలేకరులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు.

see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ .

ఇదొక దురదృష్టకర సంఘటన అన్నారు. భద్రకాళి ఫైర్ వర్క్స్ కంపెనీలో అగ్నిప్రమాదంలో 8 మంది చనిపోయారని, సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అతన్ని నిమ్స్ కు తరలిస్తున్నామని చెప్పారు. మిగిలిన నలుగురికి మైనర్ గాయాలయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని చెప్పారు. అదేవిధంగా గాయాలైన వారికి చికిత్స పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. మృతులలో ఇద్దరు మహిళలున్నారని, వారికి ఐదుగురు ఆడపిల్లలున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఐదుగురు ఆడపిల్లలను గురుకులాల్లో చేర్పించి వారి విద్యాబాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. చనిపోయిన వారి దహన సంస్కారాల కోసం ఒక్కొక్కరికి 10వేల రూపాయలు ఆర్ధిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించారు.

see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌

అదేవిధంగా మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద వారం రోజుల పాటు రేషన్ సరుకులు ఉచితంగా అందించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కలున్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని, రెవెన్యూ అధికారులు విచారించి వారికి తగిన ఆర్ధిక సాయం చేస్తారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫైర్ వర్క్స్ కంపెనీల గురించి పూర్తి విచారణ చేయాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం సంఘటనపై కూడా పూర్తి స్థాయిలో విచారణచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించానన్నారు. ఈ నివేదిక వచ్చాక సిఎం దృష్టికి తీసుకెళ్లి మరింత సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సమీప ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, కొండా సురేఖా, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్, ఇతర అధికారులు, నాయకులు వచ్చారని తెలిపారు. అగ్ని ప్రమాదం జరగగానే స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు లోపల ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశారని, వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.

see also:సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat