ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ పార్టీ విమర్శించింది. అనంత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పార్టీ చేసిన గర్జన దీక్షపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని,వారు దిక్కుతోచని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నారని అన్నారు.
see also:ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..!
నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు.విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..ఇప్పుడు మైనార్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.