Home / TELANGANA / ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఈరోజు సాయంత్రం భారత ప్రభుత్వ జాతీయ రహదారి రహదారుల ప్రాధికార సంస్థ అధికారులుతో సమావేశమై ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అభీష్టానుసారం ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలను జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అధికార వర్గం రచించింది.

see also:సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!

ఎంతో విలువైన అనుసంధానాన్ని కలిగించడమే కాకుండా బాగా వెనుకబడిన ప్రాంతాల మండలాలైన కుసుమంచి అశ్వరావుపేట రైతులకు తమ ప్రాంతాల నుండి సమీప మార్కెట్టు లకు తమ ఉత్పత్తుల తరలింపునకు ఈ రహదారి చాలా అనుకూలంగా ఉండగలదు. ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారి అనుసంధానానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ నిడివి మొత్తం 167 కిలోమీటర్ల కాగా ఈ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. ఎక్కడ కూడా నివాస ప్రాంతాలు,చెరువులు, కుంటలు, ఆలయాలు వంటి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈ యొక్క మొత్తం రహదారిని రూపొందించారు.

see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌ రెడ్డి సంచలన వాఖ్యలు..!!

గతంలో ఖమ్మం నుండి అశ్వరావుపేట పట్టణానికి కలిపే రహదారి నమూనాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల అనుసారం ఖమ్మం నుండి రాజమండ్రికి అనుసందనం కలిగించే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించారు.ఈ మార్గం లో ఖమ్మం–రాజమండ్రి రహధారి అనుసందానము వలన రాజమండ్రి నుండి హైదరాబాదుకు ప్రయాణించే ప్రయాణికులకు మొత్తంగా 80 కిలోమీటర్ల నిడివి తగ్గనుంది. ఈ రహధారి విజయవాడ నగరంపై ఉండే వత్తిడిని,రద్దీని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.

see also:సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్

రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం వంటి ముఖ్య నగరాలను హైదరాబాదుకు అనుసంధానించడానికి ఈ రహదారి ఎంతో ఉపయోగంగా ఉంటుంది భవిష్యత్తులో ఆయా పట్టణాల నుంచి హైదరాబాదుకు ప్రయాణించేవారికి సమయము డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఎంతో విలువైన ఇంధనం కూడా ఆదా అయ్యే విధంగా ఈ ప్రణాళికను తీర్చిదిధ్ధినారు. వచ్చే 15 రోజుల్లోగా భూసేకరణ పూర్తిగావించి టెండర్లు ఖరారు చేయనున్నామని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు.

see also:మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat