తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు.
see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు
మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి చేయడంతో అతని వేదింపులు తాళలేక సదరు వివాహిత మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో అతనిపై క్రైం నంబర్. 128/2018 ద్వారా 354ఎ, 354బి, 506 పార్ట్ -బి సెక్షన్ల కింద నిర్భయ కేసు నమోదయ్యింది.
see also:అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
కాగా కీచకుల్లాంటి శ్రీధర్ బాబు అనుచరుల ఆగడాలు వారు అధికారంలో ఉండగా కోకొల్లలుగా జరుగగా వారు అధికార బలంతో తొక్కిపెట్టారు. కాగా వారి ఆగడాలు ఇంకా కొనసాగుతుండగా ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇలాగే రామగిరి మండలంలో ఒక కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధి ఫోన్ లో మహిళతో అసభ్యంగా మాట్లాడగా ఆమె భర్తకు ఫోన్ రికార్ద్ లు దొరకడంతో అతను గ్రామంలో అందరికి వినిపించినట్లు సమాచారం. ఆ ఆడియో టేపులు బయటకు వస్తేగాని శ్రీధర్ బాబు దగుల్బాజీ అనుచరుల ఒక్కొక్కరి బాగోతం బట్టబయలు అవుతుంది అని స్థానికులు అంటున్నారు.
see also:అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి కేటీఆర్