ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వరమని, ఇందులో రాష్ట్రం చేసింది ఏమీ లేదన్నారు.
see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!
రాజకీయ బ్రోకర్లను తమ వద్దకు పంపవద్దని ఒక కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు చెప్పారన్నారు. చంద్రబాబు చేసేది ఒకటి, చెప్పేది మరొకటి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇలాగే చేస్తే ఆయన అసలు స్వరూపాన్ని, రాష్ట్రం చేసే అరాచకాలను, కేంద్రం అభివృద్ధిని ప్రజలకు ఇలాగే చెబుతుంటామన్నారు. దొంగ దీక్షలు చేస్తూనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారన్నారు. టీడీపీ రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కొంటామని చెప్పారు. కేంద్ర నిధులతో చేసే పనులకు టీడీపీ జెండాలు పెడతారా అని ధ్వజమెత్తారు. టీడీపీ రాజకీయ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసునన్నారు.