బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్- హృతిక్ రోషన్ల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇప్పటి వరకు కంగనా మాత్రమే మీడియా ముందుకు వచ్చి హృతిక్ పై వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా హీతిక్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కంగనాను ఏకంగా ఒక తాగుబోతుగా చిత్రీకరించి మళ్ళీ మంటరేపాడు హృతిక్.
జోర్డాన్‌లో షూటింగ్ పూర్తయిన సందర్భంలో పార్టీ చేసుకున్నాం. పార్టీ తర్వాత నా రూంలోకి వెళ్లిపోయాను. అప్పుడు కంగనా నా వద్దకు వచ్చి మాట్లాడాలి అంది. ఇప్పుడు కాదు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి నా రూంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఎవరో నా రూం తలుపును గట్టిగా కొడుతూనే ఉన్నారు. ఎవరా అని తలుపు తీసి చూస్తే చాలా తేడా పరిస్థితుల్లో ఆమె కన్పించింది. బాగా తాగి ఉంది. ఏం చేయాలో తెలీక నా మేనేజర్ని పిలిచాను. నా మేనేజర్ ఆమె సోదరి రంగోలీకి సమాచారం అందించడంతో ఆమెను తన రూంలోకి తీసుకెళ్లింది” అని చెప్పుకొచ్చాడు హృతిక్. మరి దీనిపై కంగనా రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.