కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ కథనం చదివితే మీరు కూడా అవుననే ఒప్పుకుంటారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే కదా..! ఆ మాజీ మంత్రికి వచ్చిన కష్టమేంటి..? ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేతతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు దాపురించింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
see also:ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు
ఇక అసలు విషయానికొస్తే రాష్ట్ర విభజన తరువాత సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఆ పార్టీలోని నాయకులంతా ఇతర పార్టీల్లోకి వసలు వెళ్లారు. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఒకరు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లినా ఓడిపోతామని తెలిసి కూడా ఆయన పార్టీ మారారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృస్టించింది. రెండు మూడు సీట్లు మినహా మిగతా అసెంబ్లీ సీట్లన్నిటిపి వైసీపీ గెలుచుకుంది. మరో కడపగా నెల్లూరు జిల్లా అవతరించింది.
see also:వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో
ఇప్పుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో అనాథలా మారిపోయారని, నారాయణ కార్పొరేట్ స్కూళ్ల అధినేత, టీడీపీ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ఆయన్ను దూరం పెట్టేశారట. అయితే, ఇటీవల నెల్లూరు జిల్లా కేంద్రంగా టీడీపీ ఆధ్వర్యంలో దళిత తేజం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి రాకకోసం ఏర్పాట్లను పూర్తి చేసే క్రమంలో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారట. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్రతోపాటు ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
see also:ప్రజా సమస్యలపై జగన్ పోరాటం ముందు.. మా కష్టం దిగదుడుపే :టాలీవుడ్ హీరో సంచలనం..!
సమీక్షా సమావేశం ముగింపు అనంతరం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి మంత్రి నారాయణను ఆహ్వానించారట. అయితే, పక్కనే ఉన్నఎమ్మెల్సీ రవిచంద్ర కలుగజేసుకుని సారు (మంత్రి నారాయణ) ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు.. ఇప్పుడు వచ్చేందుకు అవకాశం లేదు. రారు కూడాను. వెళ్లి వేరే పనేమైనా చూసుకోండి అంటూ విలేకర్ల ముందే కసురుకున్నారట.
see also:విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది
మంత్రి నారాయణ స్పందించక ముందే ఎమ్మెల్సీ రవిచంద్ర స్పందించడం, ఆపై విలేకర్ల ముందే తనను తిడుతున్నా మంత్రి స్పందించకపోవడంతో మాజీ మంత్రి దాల ప్రభాకర్‌రెడ్డి కిన్నుమనక మిన్నకుండిపోయాడట. దీంతో ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేసేదేమీ లేక రవిచంద్ర, నారాయణపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావుకు ఫిర్యాదు చేశారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.