డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ స్పెషల్ కోర్టు తనకు విధించిన రూ.30 లక్షల జరిమానాను కట్టలేనని పంజాబ్, హర్యానా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు తెలిపారు.ఈ సందర్భంగా తాను అన్నింటినీ త్యజించానని, ఈ పరిస్థితుల్లో జరిమానా కట్టడం సాధ్యం కాదని గుర్మీత్ చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది గార్గ్ నర్వానా కోర్టుకు చెప్పారు.
గుర్మీత్‌కు రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే అతనికి చెందిన డేరా సచ్చా సౌదా ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని, ఇక గుర్మీత్ ఏవిధంగానూ అంత జరిమానా చెల్లించలేడని నర్వానా చెప్పారు. తనకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గుర్మీత్ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.