Home / ANDHRAPRADESH / అనంతలో ‘వంచనపై గర్జన’

అనంతలో ‘వంచనపై గర్జన’

ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఈరోజు అనగా (జూలై 2)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో (ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా) జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్‌సభ సభ్యత్వాలను త్యాగం చేసిన వైసీపీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

see also:2019లో సింహం సింగిల్‌గా వ‌స్తుంది..!

అంతేగాక వంచన పై గర్జన కార్యక్రమంలో వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నపత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి మరియు వైసీపీ నాయకులు . ఈ వంచనపై గర్జన నిరాహార దీక్షలో పాల్గొననున్న నేతలందరూ నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్నారు.

see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!

విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రగతి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వైఎస్‌ జగన్‌ ఎలుగెత్తి చాటుతున్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా, కుయుక్తులు పన్నుతున్నా లెక్కచేయకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైసీపీ నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే ఉంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు.

see also:చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన వైఎస్ జ‌గ‌న్‌..!

హోదా ఆకాంక్షను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించిన సీఎం చంద్రబాబు సైతం చివరకు యూటర్న్‌ తీసుకోక తప్పలేదు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అధికారం అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఉద్యమం పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పోరాటంలోని అధర్మాన్ని, మోసాన్ని బహిర్గతం చేయడంతోపాటు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వంచనపై గర్జన దీక్షలు నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 see also:కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat