దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.
see also:సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..!
నెల్లూరు దళిత తేజం సభలో దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముద్దు కృష్ణమనాయుడిని తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారని, కానీ సీఎం అయ్యాక గాలికొదిలేశారని విమర్శించారు. నేనేంటో చంద్రబాబుకు తెలుసు. దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కోరుతున్నాను. చంద్రబాబు ముఖం చూసి ఓటేసిన వాళ్లు లేరు. నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబులాంటి నీచ రాజకీయ నేతలను చూడలేదు. చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని దివంగత నేత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.