ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్లు గత నాలుగు ఏళ్ళుగా జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చెప్పేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అల్లుడు,ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకత్వంలో లోపం కనిపిస్తుంది.
see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత..!
రాష్ట్రంలో ప్రతిచోట ఇల్లు కావాలన్నా..పెన్షన్ కావాలన్నా..సబ్సిడీ కావాలన్నా అఖరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం కావాలన్నా పది వేల రూపాయల నుండి పాతికవేల రూపాయల వరకు కమీషన్లను అధికార పార్టీ నేతలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.అయితే ఈ వ్యవహారం అంతా గ్రామాల్లో ఎక్కువగా ఉంది.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ..