ఆలుగడ్డ అంటే తెలియనివారు ఉండరు.నిత్యం మనం ఆలుగడ్డ తో అనేక వంటకాలు చేసుకుంటూనే ఉంటాం.ఆలుగడ్డ తో అనేక ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా తినేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఆలుగడ్డ తో చేసిన జ్యూస్ త్రాగడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
- ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
- ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు సపోర్ట్‌ను ఇస్తుంది.
- ఆలుగడ్డ జ్యూస్ త్రాగడం వలన హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
- ఆలుగడ్డల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది.
- ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్‌ను తాగితే కీళ్ల నొప్పులు పోతాయి.
- మైగ్రేన్‌తో బాధపడే వారు ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది.
- ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ నిజానికి పచ్చి ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.