వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు రోజు.. రోజుకు జనం పెరుగుతున్నారే తప్ప.. తగ్గడం లేదు. అశేష జన సందోహం నడుమ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రబాబు సర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరుగుతన్న కమీషన్ల దందాను జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. జగన్ చెప్పే మాటలు వినేందుకు ప్రజలు తండోప తండాలుగా కదలి వస్తున్నారు. జగన్ వెంటే మేమంటూ.. పాదయాత్రలో నడుస్తున్నారు.
see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
అయితే, వైఎస్ జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. భీమనపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్‌తో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఒకింత తోపులాట కూడా జరిగింది. ఈ సందర్భంలోనే ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో జగన్‌లో సెల్పీ దిగేందుకు ఆసక్తి చూపాడు. ఇంతలో అతను స్లిప్ అయి కింద పడబోతుండగా ఒక్క క్షణం కూడా లోచించ కుండా..
see also:వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్
కింద పడబోతున్న ఆ వ్యక్తిని పట్టుకుని పైకి లేపాడు. ఆ క్రమంలోనే జగన్ కూడా ఒకింత నేలకొరిగాడు. ఆ వ్యక్తిని కాపాడాలన్న ఒక్క తలంపుతోనే జగన్ చేసిన ఆ ప్రయత్నానికి పాదయాత్రలో పాల్గొన్న వారంతా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇలా జగన్ చేసిన ఆ పనికి అక్కడి వారంతా జగన్‌కు జై కొట్టారు.