దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ” యాత్ర ” పేరుతో మహి వి. రాఘవ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న విషయం విదితమే .ఈ క్రమంలోనే గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ’ ఫేమ్ విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, ఆశ్రిత వేముగండి(‘బాహుబలి’లో దేవసేన సోదరి) విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు.
see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయం చేసేందుకు యాంగ్ హిరో,రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.ప్రభాస్‌కి ప్రొడ్యూసర్ విజయ్ దగ్గరి స్నేహితుడు కావడంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు ప్రభాస్ అంగీకరించాడట. అలాగే ప్రభాస్‌కి ఈ సినిమా స్టోరీ నెరేషన్ చాలా నచ్చిందని టాక్ . దీంతో ప్రభాస్.. బడ్జెట్ గురించి వర్రీ అవ్వొద్దని విజయ్‌కు సూచించినట్టు తెలుస్తోంది. మహి, విజయ్ చాలా మంది హీరోలను సాయం కోరారట. కానీ ప్రభాస్ తనవంతు సాయం చేస్తానని మాటిచ్చాడని సమాచారం.