స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరిట జనం లేని సభలు పెడుతూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్ర పేరు మార్చి బీజేపీ వాళ్ళు మరో యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళ బస్సు యాత్ర తుస్సుమందని, బీజేపీ వాళ్ళది కూడా అట్టర్ ప్లాప్ అయ్యిందని కర్నె తెలిపారు.
see also:ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు ,రివార్డులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వాని వారు విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు తమ యాత్రలో ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ హామీని ప్రధాని మోడీ గారి నోటి వెంట చెప్పించాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం గురించి, హక్కుల గురించి బీజేపీ వాళ్ళు ఎపుడైనా మోడీని ఆడిగిన పాపాన పోయారా అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.
see also:కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు షాక్ ఇచ్చిన ముసలవ్వ
ప్రజలలో బీజేపీ పై చులకన భావం పెరిగేలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. మధ్యప్రదేశ్ లో 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని మాట తప్పారని అది బీజేపీ నైజమన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని పేర్కొంటూ దాన్ని తప్పకుండా నిలుపుకుంటామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నేర వేర్చింది అని ప్రజలకు చెప్పే ధైర్యం బీజేపీ రాష్ట్ర నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ హక్కుల పై పోరాటం చేస్తూ…తమ ప్రజలకు మంచి పనుల కోసం కొన్ని విషయాలపై సపోర్ట్ చేస్తామన్నారు. బీజేపీ కి ఓట్ల యావ తప్ప మరేమి లేదని ఆయన అన్నారు. బీజేపీ మత రాజకీయాలు తెలంగాణలో సాగవని ఆయన వెల్లడించారు.