గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్.. గన్నవరం చేరుకున్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు.
see also:కేసీఆర్ పాత్రలో ఎవరో తెలుసా..?
ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గేట్‌వే హోటల్‌కు వెళ్లిన కేసీఆర్ అక్కడి నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు సొంత కాన్వాయ్‌లో దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మహామండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు..అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
see also:బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!
దాదాపు 40 నిముషాల పాటు అమ్మవారిని సన్నిధిలోనే ఉన్నారు. కేసీఆర్ సమర్పించిన ముక్కు పుడకను 11.29 గ్రాముల బంగారంతో తయారు చేయించగా.. దానిలో 57 వజ్రాలున్నాయికేసీఆర్ వెంట మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సుమన్, కే కేశవరావు ఉన్నారు.