వీరి చిరునవ్వు చెబుతోంది 2019 పాలన గురించి..! అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిరునవ్వుతో జగన్కు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను వింటూ.. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ.. ప్రజలకు తానున్నానంటూ భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
కాగా, మంగళవారం అమలాపురంలో జరిగిన పాదయాత్రలో జగన్ను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరు చిరునవ్వులతో జగన్పు పలకరించారు. జగన్ కూడా అదే రీతిన ఉంటూ వారి బాధకసాదకాలను ఎంతో ఓపిగ్గా విన్నారు. ఇలా వైఎస్ జగన్ అనునిత్యం చిరునవ్వు చిందిస్తూ ముందుకు సాగుతుండటంతో.. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారు కూడా చిరునవ్వుతో తిరిగి వెళుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ ఆ చిరునవ్వు నాడు రాజన్నకు సొంతమైతే.. నేడు జగన్కు సొంతమైందని చర్చించుకోవడం గమనార్హం.