వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా అమరాపురంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసింద. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలను లెక్కలతో సహా ప్రజలకు వివరించారు. అలాగే, చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురం ప్రజలు.
ఇదిలా ఉండగా, బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. జగన్ మాట్లాడుతుండగా ఓ మహిళ మూడంతస్తుల భవనం చివరన నిలబడి వీడియో తీస్తోంది. ఆ మహిళ మూడంతస్తుల భవనంపై నిలబడటాన్ని గమనించిన జగన్ మాట్లాడుతూ.. తల్లీ నన్ను బాగా వీడియో తీయి.. కానీ, అంతకు ముందు నీవు జాగ్రత్త అంటూ చెప్పడంతో అక్కడి ప్రజలంతా కరతాల ధ్వనులతో హర్షాన్ని వ్యక్తం చేశారు.