రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ మరిసారి పార్టీ మరనున్నారా..?త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవువనే సమాధానం వినపడుతుంది.ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . ఇవాళ ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది.
see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!
ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా చెప్పారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని.. పార్టీకి నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆయనపై పార్టీ నాయకత్వం యాక్షన్ తీసుకోవాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. అందులో ఎంపీ కవితతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సంతకాలు చేశారు.అయితే డి.శ్రీనివాస్ కూడా గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో మకాం వేసారని సమాచారం.అయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి.