బిర్యానీ బాగోలేదని ఓ టీడీపీ నేత తన గ్యాంగ్‌ను తీసుకొచ్చి మరీ రాడ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాగా, అనుచరులతో కలిసి బిర్యాని తినడానికి చవ్చిన ఓ టీడీపీ లీడర్ ఆ తరువాత , కాసేపటికి కారులో తీరిగ్గా నలుగురిని వేసుకుని వచ్చాడు.
తన మనుషులతోపాటు డిక్కీలో రాడ్లను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేదని సిబ్బందిపై మండిపడుతూ రాడ్లతో దాడికి తిగాడు. టీడీపీ నేత దాడిపై తాడికొండ హోటల్ సిబ్బంది పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కేసు నమోదు చే సేందుకు నిరాకరించారు.