తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలగం వెంకటరావు వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులకోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం బాగుందని అన్నారు.