ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఉత్తమ శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసింది.గాజువాక పరిధిలోని అగనంపూడి కాలనీకి చెందిన కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ముత్యాలుకి ప్రతిష్టాత్మకరమైన శ్రమశక్తి అవార్డును ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అతన్ని గుర్తించింది.
అయితే ఈ ముత్యాలు సరిగ్గా ఎనిమిదేళ్ళకిందట అంటే 2010ఏడాదిలో ఒక బాలింత ఇంటి పైకప్పు చీల్చి మరి ఆ ఇంట్లోకి దూరి మరి ఆమెను బలాత్కరించి వక్షోజాలు కోసి కొరికిన కేసులో అతనిపై ఐపీసీ 376సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు.
ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.అయితే టీడీపీ ప్రభుత్వం ఎలాంటి వారిని అదరిస్తున్నందనడానికి ప్రత్యేక్ష ఉదాహారణ ఇది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నయి.ఈ అవార్డును గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ,కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ,ఆ అవార్డు గ్రహీత తండ్రి కత్తి ముత్యాలు ,టీడీపీ సెల్ అధ్యక్షులు సిఫార్సులతో వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..