Home / POLITICS / మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో క‌ల‌వ‌రం

మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో క‌ల‌వ‌రం

తెలుగుదేశం పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఆ పార్టీ నాయ‌కుడికి సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు శ్రీ‌కారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో ర‌గిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు భ‌రోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గత వారం పదిరోజులుగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. గత కొన్నిరోజులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రివర్గ సమావేశానికి కూడా మొఖం చాటేశారు. ఇదిలా ఉంటే శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన మంత్రి గంటా నెల్లూరు నగరంలోని ఆనం నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పైకి మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా వీరిరువురి మధ్య అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ తరపున ఆనంను బుజ్జగించే బాధ్యతను అధిష్టానం నిజంగా గంటాకు అప్పగించి ఉంటే ఆయనతో పాటు జిల్లా పార్టీలోని ముఖ్యమైన నాయకులు కూడా వెళ్లి ఉండేవారు. అయితే అందుకు భిన్నంగా గంటా ఒక్కరే ఆనం నివాసానికి వెళ్లడం సుదీర్ఘంగా మంతనాలు జరపడాన్ని బట్టి చూస్తుంటే తెలుగుదేశంలోని అసమ్మతి నేతలందరినీ మాజీ మంత్రి ఆనం ఓ వర్గంగా కూడగట్టి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారి చక్రం తిప్పాలన్న వ్యూహంతోనే పావులు కదుపుతున్నట్లు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనను బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు.

అధికార తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురవేసి త్వరలో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో భేటీ కావడం ప్రధాన చర్చానీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు చిరునామా అయిన బాబుకు అదే రాజకీయాన్ని ఈ ఇద్ద‌రు నేత‌లు రుచి చూపించ‌నున్నార‌ని అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat