ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న జగన్.. వైసీపీ ఐటి వింగ్ విభాగం తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది. అయితే వీరంతా బెంగళూరు నుంచి రావడం వారు జగన్ వారితో భేటీ అయ్యి ఏ అంశాలపై చర్చించి వుంటారు అన్నది ఆసక్తికరమైంది.
అయితే జగన్ పార్టీ సోషల్ మీడియాలో ఎంత హుషారుగా ఉంటుందో అందరికి తెలిసిందే.. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసింది . వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గంలో బాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పనులను,కార్యక్రమాలను,అవినీతిని, వెంటనే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళుతున్నారు.అయితే సోషల్ మీడియా వింగ్ ను మరింత బలోపేతం చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భావించారు. అందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక టౌన్ లో సోషల్ మీడియా టీం సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. దాదాపు మూడు వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశం వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి జగన్ కూడా హాజరై వారికి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు ముందే వచ్చే అవకాశాలు ఉండటంతో పక్కా స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలని వారికి సూచనలు చేశారు . రాష్ట్రంలోని నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని వారికీ సూచించారు.ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరును, ఆ నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులు, సమస్యలతో ప్రత్యేకంగా ప్రచారం చేయనున్నారు. మొత్తం మీద ఇక సోషల్ మీడియాలో వైసీపీ ఉధృతంగా వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు.