ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవత్వం మంట గల్సిపోతుంది.ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఒక పక్క మహిళపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు .మరోపక్క కన్న వారిపైనే కన్నబిడ్డలు దాడులు చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర లోని వాసిమ్ గ్రామంలో నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లిని కడతేర్చాడు ఒక ప్రభుద్దుడు .ఆ ప్రబుద్ధుడికి గ్రామంలో ఒక వ్యక్తికీ భూవివాదాలు చోటుచేసుకున్నాయి .దీంతో దీనిపై ఇరువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .అయితే న్యాయస్థానం ఆ భూమి వేరే వ్యక్తికీ చెల్లుతుందని తీర్పునిచ్చింది .దీంతో కేసులో ఓడిపోయాను అనే కోపంతో పక్కనే కేసులో గెలిచిన వ్యక్తీ ట్రాక్టర్ దున్నుతుండగా వెళ్లి మరి గొడవ పెట్టుకున్నాడు .
అంతే కాకుండా ఏకంగా తన తల్లిని విసురుతూ ఆ ట్రాక్టర్ కిందకు నెట్టాడు .దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి .. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.తల్లిని ట్రాక్టర్ కింద పడేసే కంటే తనే పడిపోతే బాగుండేది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ..