Home / ANDHRAPRADESH / సంచ‌ల‌నం..ప‌వ‌న్‌ను నడిపోస్తోంది బాబు ఆప్తుడే..ఎవరో తెలుసా..?

సంచ‌ల‌నం..ప‌వ‌న్‌ను నడిపోస్తోంది బాబు ఆప్తుడే..ఎవరో తెలుసా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దోస్తీ వీడిపోయార‌నేది టీడీపీ నాయ‌కులు ప్ర‌చారంలో పెట్టిన మాట‌. ఇందుకు త‌గిన‌ట్లే ఆ పార్టీల నేత‌లు క‌వ‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేద‌ని పలువురు పేర్కొంటున్నారు. ప‌వ‌న్‌ను ఇప్ప‌టికీ చంద్ర‌బాబు న‌డిపిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కార‌ణంగా తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ టూర్‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

విజ‌య‌వాడ‌కు మకాం మార్చేందుకు సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పెష‌ల్ చార్టెడ్ ఫ్లైట్‌లో విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి రాగా ఆయ‌న‌కు AP 16 BG 0666 గ‌ల ఆ బీఎండ్ల్యూ కారు వ‌ద్ద గౌర‌వంగా నిలుచున్న డ్రైవ‌ర్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఓ ఫైవ్ స్టార్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువెళ్లాడు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్  బీఎండ‌బ్ల్యూ 7 కారును ఓ భారీ కాన్వాయ్ ఫాలో అయింది. ఇదంతా చూసిన వారికి ప‌వ‌న్ వెనుక ఎవ‌రున్నారు? అనే సందేహం క‌ల‌గ‌డంలో అనుమాన‌మే లేదు.ఈ కారు వివ‌రాలు ఆరాతీయ‌గా సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం నివ‌సిస్తున్న క‌ర‌క‌ట్ట ఇళ్లు య‌జ‌మాని అయిన లింగ‌మనేని సంస్థ‌ల యాజ‌మాన్యం పేరుతో ఆ కారు రిజిస్ట్రేష‌న్ ఉంది. బాబుకు బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారు అయిన ఈ సంస్థ ప‌వ‌న్‌కు ద‌గ్గ‌రుండి ఏర్పాట్లు చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది.

విజయవాడ కేంద్రంగా పని చేసి ఆర్థిక క‌ష్టాల కార‌ణంగా తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా అధిప‌తులైన లింగ‌మ‌నేని గ్రూప్ ఇప్పుడు ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం వెనుక రెండు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అందులో మొద‌టిది..ఇదంతా బాబు గేమ్ ప్లాన్‌లో భాగ‌మ‌ని రెండోది…వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ టీడీపీ గెలిచే అవ‌కాశం లేద‌ని భావించిన సద‌రు సంస్థ పెద్ద‌లు కొద్దొగొప్పో బ‌లంగా ఉన్న‌జ‌న‌సేన‌క‌లిసి ముందుకు సాగ‌డం మేల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్న లింగ‌మ‌నేని గ్రూప్ ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా సంచ‌ల‌నంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat