టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు అధ్సక్షతన ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తి లో జయశంకర్ గారిపాత్రా గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేసారని, ప్రతి వ్యక్తి జీవితం లో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.టీఆర్ఎస్ పార్టీకి -జయశంకర్ గారికి ఉన్న అనుబందం గురించి సభకు వివరించారు. తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ గారు చేసిన కృషి చాలా గొప్పదని తెలిపారు.ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్న తీరుని, వివిద రంగాల్లో నేటి వరకు జరిగిన -బావిష్యత్తులో జరగబోయే అభివృద్ది గురించి సభకు వివరించారు.టీఆర్ఎస్ పార్టీ జెండా మోసే అవకాశం కలిగించిన కేసీఆర్ గారికి, మమ్మల్ని ప్రోత్సహించిన కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు.గతం లో తెలిపినట్టు మరొక్కసారి ఆసక్తి గల టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, మద్దతుదారులు ముందుకు వచ్చి అధికారిక శాఖ లో పాల్గొని మనమందరం కలిసి పార్టీకి మన వంతు బాద్యత నిరహిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య నాయకులు సనీల్ రెడ్డి బసిరెడ్డి ,సాయి యాదవ్, వేణు నాన్న , రాకేష్ గుప్త ,ప్రవీణ్ లేదెల్ల, విశ్వామిత్ర , యశ్వంత్ ,సతీష్ కుమార్ , రామ్ యాదవ్ ,సంజీవ్ రెడ్డి రాయి రెడ్డి,నితిన్ రావు జూలపల్లి ,అయాన్ ,సాహిత్ రావు , ఉదయ్ రెడ్డి , విక్రమ్ కందుల ,శ్రీధర్ రెడ్డి, మొహమ్మెద్ జావెజ్ జలాల్ ,రవి మోతె , ఆకాష్ కాత్యాల్ ప్రదీప్ యాదవ్,ఉమర్, చందు, శ్రీకాంత్ లోకేష్, సాహిత్ రావ్ బలుమూరి, శివ జంధ్యాల, వ్రిoచి రెడ్డి,క్రాంతి, జీవన్ భరత్ కుమార్,ATAI నాయకులూ అమరేందర్ , ప్రవీణ్ దేశం , పుల్ల రెడ్డి బద్దం , కృష్ణ రెడ్డి వడియాల , రవీందర్ దామెర ,ఫణి రంగరాజ్ , సతీష్ పాటి , మహేష్ రెడ్డి బద్దం ఇతర తెలంగాణ వాదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.